రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపిక
మోత్కూరు : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 జూడో పోటీలు శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ పోటీలకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. బాలికల విభాగంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన ఎస్.శ్రీజ, కె.సిరిచందన, కె.సిరి, డి.సహస్ర, సీహెచ్.అస్మిత, పి.మేఘన, టి.రుచిత, వి.హాసిని ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే బాలుర విభాగంలో డి.అభిషేక్, మనిసాత్విక్, కె.సాయిరాం, ఉపేందర్, కె.విజ్ఞాన్ ప్రథమ స్థానం సాధించారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో బి.వైష్ణవి, కె.భానుశ్రీ, ఆర్.హారిక, అంజలి ద్వితీయ స్థానం సాధించారని జూడో కోచ్ అన్నెపు వెంకట్ తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచిన 13 మంది విద్యార్థులు ఈ నెల 28, 29, 30 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సభ్యుడు ప్రసాద్, ఎంఈఓ టి.గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జూడో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ పి.బాలరాజు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవిశెట్టి అవిలుమల్లు, బీసీ, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పోచం సోమయ్య, మెంట నగేష్, పీఈటీలు జి.జ్ఞానసుందరి, పి.శ్వేత, ఇన్‌స్ట్రక్టర్ కనుకు రాజు, చొల్లేటి నరేష్, పోచం మచ్చేందర్, పుల్కరం నిఖిల్, ఊర మత్స్యగిరి పాల్గొన్నారు.


