ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శుక్రవారం సుభాష్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు రద్దు చేసి కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు తేవడం సరికాదని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ, చిన్నవెంకులు, దండంపల్లి సరోజ, ఎండీ.సలీం, దండంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, కుంభం కృష్ణారెడ్డి, అవుట రవీందర్, గంజి నాగరాజు, మన్నె భిక్షం, పోలె సత్యనారాయణ, సర్దార్ అలీ, అంజయ్య, రవీందర్, రాజేష్, ఆవుల అనురాధ, కృష్ణమూర్తి పాల్గొన్నారు.


