4.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
నల్లగొండ : వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దగ్గర పడ్డాయి. రెండు నెలల క్రితం జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 4.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా కేంద్రాల్లో 25 నుంచి 30 టన్నుల ధాన్యం ఉంది. ఈ నెల చివరిలోగా అవి కూడా కాంటాలు వేస్తే.. కొనుగోళ్లు పూర్తి కానున్నాయి.
60 కేంద్రాల్లో ధాన్యం రాశులు
ఈ సీజన్‌లో మొత్తం 392 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయ్యాయి. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలో ఆలస్యంగా కోతలు ప్రారంభం కావడంతో అక్కడ ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు వస్తోంది. అక్కడ 60 కేంద్రాల్లో ధాన్యం రాశులు ఉన్నాయి.
వెంటనే ట్రక్ షీట్ ఇవ్వని మిల్లర్లు..
జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 85,175 మంది రైతుల నుంచి రూ.1158 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు చెల్లించింది రూ.1078 కోట్లే. ఇంకా రూ.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ట్యాబ్ ఎంట్రీలు చేసి ధాన్యాన్ని మిల్లులకు పంపినా మిల్లర్లు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో ఆలస్యం అవుతోంది. దీంతో ట్యాబ్ ఎంట్రీలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులకు చెల్లింపుల్లోనూ ఆలస్యం అవుతోంది.
ఫ కేంద్రాల్లో మరో 30 టన్నులు ఉన్నట్లు అంచనా
ఫ ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం


