కోమాల్లోకి వెళ్లిన కొడుకు! న్యాయం కోసం ట్యాంక్ ఎక్కిన‌ త‌ల్లి.. చివ‌ర‌కి? | - | Sakshi
Sakshi News home page

కోమాల్లోకి వెళ్లిన కొడుకు! న్యాయం కోసం ట్యాంక్ ఎక్కిన‌ త‌ల్లి.. చివ‌ర‌కి?

Dec 22 2023 12:24 AM | Updated on Dec 22 2023 2:21 PM

- - Sakshi

ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలుపుతున్న అచ్చమ్మ

నల్గొండ: తన కుమారుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ గురువారం నడిగూడెం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో వాటర్‌ ట్యాంక ఎక్కి నిరసన తెలిపింది. వివరాలు.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన గుంజ యల్లయ్య, మురళి అన్నదమ్ములు. మురళికి, అతడి భార్యకు కొద్దిరోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. గత నెల మురళి, అతడి భార్య గొడవ పడుతుంగా.. యల్లయ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా కొందరు దుండగులు అతడిపై దాడి చేశారు.

దీంతో యల్లయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లి ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని, కానీ తమకు ఇప్పటి వరకు న్యాయం చేయడం లేదని యల్లయ్య తల్లి అచ్చమ్మ గురువారం నడిగూడెం బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఏడుకొండలు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అచ్చమ్మను కిందకు దించారు.
ఇవి చ‌ద‌వండి: నడి సంద్రంలో పెను ప్రమాదం! ఒక్క‌సారిగా..

Advertisement
 
Advertisement
Advertisement