Telangana Crime News: గణేశ్‌ శోభాయాత్రలో.. డీజే ఆపినందుకు ఒక్కసారిగా.. వ్యక్తిపై కత్తితో దాడి!!
Sakshi News home page

గణేశ్‌ శోభాయాత్రలో.. డీజే ఆపినందుకు ఒక్కసారిగా.. వ్యక్తిపై కత్తితో దాడి!!

Sep 24 2023 1:46 AM | Updated on Sep 24 2023 12:22 PM

- - Sakshi

నల్గొండ: గణేశ్‌ శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి మిర్యాలగూడ డీసీఎం యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ వెంకన్నపై కత్తితో దాడి చేశాడు. మిర్యాలగూడ పట్ణంలోని వాసవీనగర్‌లో నివాసముంటున్న సుంకరబోయిన వెంకన్న డీసీఎం డ్రైవర్స్‌, ఓనర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శనివారం నిర్వహిస్తున్న శోభాయాత్రలో పాల్గొన్నాడు.

వాడపల్లిలో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో పట్టణంలో నిర్వహిస్తున్న శోభాయాత్రలో మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన నాగరాజు కూడా పాల్గొన్నాడు. నాగరాజు గంజాయి మత్తులో డీజేకు అనుగుణంగా నృత్యం చేస్తూ శోభాయాత్రను ముందుకు సాగనివ్వడం లేదు. దీంతో శోభాయాత్ర నిర్వాహకులు డీజేని ఆపి ముందుకు సాగుతున్నారు.

దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు వెంట తెచ్చుకున్న కత్తితో వెంకన్నపై దాడి చేశాడు. గమనించిన కొందరు నాగరాజుని అడ్డుకుని గాయపడిన వెంకన్నను ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకన్నను డీఎస్పీ వెంకటగిరి కలిసి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ శ్రీనునాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement