ఓటు.. సొంతూరిలోనే.. | - | Sakshi
Sakshi News home page

ఓటు.. సొంతూరిలోనే..

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాల్లోని పట్టణాల్లో, ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఓట్లు తగ్గుతున్నాయి. గ్రామాల్లో ఓట్లు ఉన్నా, మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పట్టణాల్లో పలువురి ఓట్లు నమోదు చేయించి కొందరు నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందారు. రెండోచోట్లా ఓట్లు ఉన్నవారిలో చాలా మంది.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (సర్‌) సొంత గ్రామాల్లోనే ఓట్లు హక్కు ఉంచుకునేందుకు మొగ్గుచూపారు. గ్రామంలోనే ఎన్యుమరేషన్‌ చేయించుకున్నారు. దీంతో పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. సర్‌ ఎన్యుమరేషన్‌ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. దీంతో అధికారులు లెక్కలు తేల్చారు. జిల్లా వ్యాప్తంగా 1,58,635 మంది ఓట్లు రద్దు కానున్నాయి. అయితే ఇందులో చనిపోయిన వారు, వలస వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు.

89.54 శాతం ఎన్యుమరేషన్‌

మొత్తంగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 15,16,253 మంది ఓటర్లు ఉండగా, 13,57,618 మంది (89.54 శాతం) తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేయడంతో డిజిటలైజ్‌ చేశారు. 1,58,635 మంది (10.46 శాతం) ఎనుమరేషన్‌ పత్రాలను అందజేయకపోవడంతో వారి ఓట్లు రద్దు కానున్నాయి.

నల్లగొండ పట్టణంలోనే అత్యధికంగా రద్దు

జిల్లాలోని పట్టణాలు, మున్సిపాలిటీలు, మండలాల వారీగా చూస్తే నల్లగొండలోనే అత్యధికంగా ఓట్లు రద్దు కానున్నాయి. నల్లగొండ పట్టణంలో 1,74,912 ఓటర్లు ఉండగా, అందులో 1,48,981 మంది (85.17 శాతం) ఓటర్లు పట్టణంలోనే తమ ఓటు ఉండేలా ఎన్యుమరేషన్‌ చేయించుకున్నారు. 25,931 మంది (14.83 శాతం) ఓటర్లు తమ స్వగ్రామాల్లో ఓటు హక్కు ఉండేలా నమోదు చేసుకున్నారు. అందులోనూ కొంత మంది చనిపోయిన వారు ఉండగా, మరికొంత మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు ఉన్నారు.

రెండో స్థానంలో మిర్యాలగూడ

ఓట్లు రద్దు కానున్న పట్టణాల్లో మిర్యాలగూడ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 1,48,822 మంది ఓటర్లు ఉండగా, 1,25,315 మంది ఓటర్లు పట్టణంలో ఓటు ఉండేలా ఎన్యుమరేషన్‌ చేయించుకున్నారు. 23,507 మంది మిర్యాలగూడ పట్టణంలో ఉండే ఓటు హక్కును వదులుకున్నారు. దేవరకొండలో 10,424 మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారు. ఆ తరువాత స్థానాల్లో చౌటుప్పల్‌, చిట్యాల, హాలియా, చండూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే నందికొండ మున్సిపాలిటీ పెద్దవూర మండలం కిందే ఉండటంతో ప్రత్యేకంగా లెక్కలు తేల్చలేదు. అక్కడ పెద్దవూర మండలం, నందికొండ మున్సిపాలిటీ కలుపుకొని మొత్తంగా 6,855 ఓట్లు రద్దు కానున్నాయి.

డిండి మండలంలో అత్యధికంగా గల్లంతు

మండలాల పరంగా చూస్తే డిండి మండలంలో అత్యధికంగా ఓట్లు రద్దు కానున్నాయి. డిండి మండలంలో 6,200 మంది ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేయలేదు. దీంతో వారు ఓట్లు రద్దు కానున్నాయి. ఇక ఆ తరువాత చింతపల్లి మండలంలో 5119 మంది ఓట్లు, కొండమల్లేపల్లిలో 4,744 మంది ఓట్లు, చందంపేటలో 4,203 మంది ఓట్లు, దామరచర్లలో 4,504 మంది ఓట్లు, నార్కట్‌పల్లిలో 3845 మంది ఓట్లు రద్దు కానున్నాయి.

మండలాల వారీగా సర్‌ ఎన్యుమరేషన్‌ వివరాలు..

మండలం ఓటర్లు డిజిటలైజ్డ్‌ శాతం డిజిటలైజ్‌కానివారు శాతం

చందంపేట 30981 26778 86.43 4203 13.57

చింతపల్లి 45727 40608 88.81 5119 11.19

గుడిపల్లి 12371 11342 91.68 1029 8.32

గుండ్లపల్లి (డిండి) 41908 35708 85.21 6200 14.79

కొండమల్లేపల్లి 29984 25240 84.18 4744 15.82

నేరెడుగొమ్ము 20383 18026 88.44 2357 11.56

పీఏపల్లి 27880 25141 90.18 2739 9.82

గుర్రంపోడు 38134 35286 92.53 2848 7.47

నిడమనూరు 35731 32969 92.27 2762 7.73

పెద్దవూర 46347 39492 85.21 6855 14.79

తిరుమలగిరిసాగర్‌ 34226 31981 93.44 2245 6.56

త్రిపురారం 36239 33035 91.16 3204 8.84

అడవిదేవులపల్లి 14740 13563 92.01 1177 7.99

దామరచర్ల 41029 36525 89.02 4504 10.98

మాడుగులపల్లి 30446 28509 93.63 1937 6.37

వేములపల్లి 20613 19446 94.34 1167 5.66

కనగల్‌ 37139 34461 92.79 2678 7.21

తిప్పర్తి 30101 27434 91.14 2667 8.86

గట్టుప్పల్‌ 15651 14764 94.33 887 5.67

మర్రిగూడ 30503 28492 93.41 2011 6.59

మునుగోడు 38443 35870 93.31 2573 6.69

నాంపల్లి 36748 33460 91.05 3288 8.95

కట్టంగూరు 37612 35624 94.71 1988 5.29

కేతేపల్లి 31361 28902 92.16 2459 7.84

నార్కట్‌పల్లి 44091 40246 91.28 3845 8.72

మున్సిపాలిటీతోపాటు ఆ పరిధిలోని మండలంలో ఎన్యుమరేషన్‌ వివరాలు..

మున్సిపాలిటీ ఓటర్లు డిజిటలైజ్డ్‌ శాతం డిజిటలైజ్‌ కానివారు శాతం

నల్లగొండ 174912 148981 85.17 25931 14.83

మిర్యాలగూడ 148822 125315 84.20 23507 15.80

దేవరకొండ 59864 49440 82.59 10424 17.41

నకిరేకల్‌ 51946 46914 90.31 5032 9.69

చండూరు 35724 33720 94.39 2004 5.61

చిట్యాల 48249 44770 92.79 3479 7.21

హాలియా 36388 33254 91.39 3134 8.61

ఫ మున్సిపల్‌ ఎన్నికల సమయంలో కొందరు పట్టణాల్లోనూ నమోదు

ఫ ఇప్పుడు గ్రామాల్లోనే ఓటు ఉండేలా ఎన్యుమరేషన్‌

ఫ జిల్లా వ్యాప్తంగా రద్దు కానున్న 1.58 లక్షలు ఓట్లు

ఫ వీటిలో మున్సిపాలిటీ కేంద్రాల్లోనే అత్యధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement