1,00,114 మంది ఓటర్లు వలస | - | Sakshi
Sakshi News home page

1,00,114 మంది ఓటర్లు వలస

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ‘సర్‌’ ఎన్యుమరేషన్‌ ఫారాలను తిరిగి ఇవ్వని 1,58,635 మందిలో 1,00,114 మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళినట్లు తేలింది. మరో 32,517 మంది ఓటర్లు మరణించినట్లు అధికారులు గుర్తించారు. 18,834 మంది ఇతర ప్రాంతాల్లో ఎన్‌రోల్‌ చేసుకోగా, 6,978 మంది అసలే ఎన్‌రోల్‌ చేసుకోలేదు. వివిధ కారణాలతో ఎన్‌రోల్‌ కాని వారు మరో 192 మంది ఉన్నారు. మరోవైపు మొత్తం ఓటర్లు 15,16,253 మందిలో 13,57,607 మంది (మ్యాపింగ్‌ కాని వారితో కలిపి) ఎన్యుమరేషన్‌ చేయించుకున్నారు. అందులో 7,75,323 మంది ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎన్‌రోల్‌ చేసుకోగా, 5,48,466 మంది సొంతంగా ఎన్‌రోల్‌ చేసుకున్నట్లు అధికారులు తేల్చారు. ఇక మ్యాపింగ్‌ కాని వారు మరో 33,818 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నియోజకవర్గాల వారీగా వివరాలు ఇలా..

● దేవరకొండ నియోజకవర్గంలో 36,815 మంది ఎన్యుమరేషన్‌ చేయించుకోని వారుంటే, అందులో 7,451 మర చిన వారు, 21,313 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 7,629 మంది వేరే ప్రాంతంలో ఎనన్‌రోల్‌ చేసుకున్నారు. 395 మంది ఎన్‌రోల్‌ చేసుకోకపోగాపోగా, 27 మంది ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు.

● నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో 21,314 మంది ఎన్యుమరేషన్‌ చేయించుకోని వారుంటే, అందులో 3,572 మరణించిన వారు, 14,612 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 2,429 మంది వేరే ప్రాంతంలో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 700 మంది ఎన్‌రోల్‌ చేసుకోకపోగాపోగా, ఒక్కరు ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు.

● మిర్యాలగూడ నియోజకవర్గంలో 31,412 మంది ఎన్యుమరేషన్‌ చేయించుకోని వారుంటే, అందులో 5,386 మరణించిన వారు, 20,254 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 2,385 మంది వేరే ప్రాంతంలో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 3371 మంది ఎన్‌రోల్‌ చేసుకోకపోగాపోగా, 16 మంది ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు.

● నల్లగొండ నియోజకవర్గంలో 31,890 మంది ఎన్యుమరేషన్‌ చేయించుకోని వారుంటే, అందులో 4,745 మర ణించిన వారు, 23,221 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 2,716 మంది వేరే ప్రాంతంలో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 1,208 మంది ఎన్‌రోల్‌ చేసుకోలేదు.

● మునుగోడు నియోజకవర్గంలో17,035 మంది ఎన్యుమరేషన్‌ చేయించుకోని వారుంటే, అందులో4,842 మరణించిన వారు, 9,040 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 1,731 మంది వేరే ప్రాంతంలో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 1,304 మంది ఎన్‌రోల్‌ చేసుకోకపోగాపోగా, 119 మంది ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు.

● నకిరేకల్‌ నియోజకవర్గంలో 20,169 మంది ఎన్యూమరేషన్‌ చేయించుకోని వారుంటే, అందులో 6,521 మరణించిన వారు, 11,704 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 1,944 మంది వేరే ప్రాంతంలో ఎన్‌రోల్‌ చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement