ఫ నల్లగొండ రైల్వేస్టేషన్‌లో వసతుల లేమి
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు వసతులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. స్టేషన్‌కు వచ్చే అనారోగ్య బాధితులు, దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన వీల్‌చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నల్లగొండ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నుంచి నడవలేని స్థితిలో ఉన్న ఓ బాధితుడిని.. సహాయకుడు తన వీపుపై మోసుకుంటూ బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పేరుతో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, అత్యవసర వేళల్లో రోగులకు, వృద్ధులకు కనీస పరికరాలు అందకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద వీల్‌చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉంచాలని కోరారు.


