ఎంజీయూలో పీజీ తరగతులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎంజీయూలో పీజీ తరగతులు ప్రారంభం

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీజీ మూడవ సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమైనట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కొప్పుల అంజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 75 శాతం హాజరు లేని విద్యార్థులను పరీక్షలకు అనుమతించమని, ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు విధిగా తరగతులకు హాజరు కావాలని సూచించారు.

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా వెంకటయ్య

నల్లగొండ : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ 1104 యూనియన్‌ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండకు చెందిన నిమ్మచెట్ల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ వెంకటయ్యను ఎంపిక చేసింది. ప్రస్తుతం వెంకటయ్య నల్లగొండ విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయంలో జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 1104 యూనియన్‌లో ఆయన సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వెంకటయ్య 2008 నుంచి యూని యన్‌ బాధ్యతల్లో ఉన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై వెంకటయ్య యూని యన్‌ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వెంకటయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

యాగాలు చేయడం కాదు..

వాటా కోసం పోరాడాలి

మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం వర్షాల కోసం యాగాలు చేయడం కంటే.. రావాల్సిన నీటి వాటా కోసం కోసం పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 13న జరిగే కేఆర్‌ఎంబీ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను వివరించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీశైలంలో 182టీఎంసీల నీరు చేరిందన్నారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు 25వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు పంపుతున్నారని అన్నారు. అక్కడి రిజార్వాయర్లు నిండిన తర్వాతే నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తామనడం అన్యాయమన్నారు. ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీటిని కాల్వలకు వదలడం వల్ల భూగర్భజలా లు పెరిగి పంటలకు ఉపయోగపడుతుందన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వానాకాలం సాగుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో మిల్లు నడవకపోతే అందులో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాదిని కోల్పోవడమే కాక బియ్యం ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. సమావేశంలో డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, పరుశురాములు, బావండ్ల పాండు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement