దాదాపు నాలుగేళ్ల తర్వాత రానున్న కొత్త పింఛన్లు
నాగర్‌కర్నూల్: ఎన్నో ఏళ్ల నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వివిధ కేటగిరిల లబ్ధిదారుల కల ఎట్టకేలకు ఫలించనుంది. గత నాలుగేళ్లుగా అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపన చేసిన పాలక ప్రభుత్వాలు వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా కసరత్తు ప్రారంభించాయి. కొత్త పింఛన్లు ఇవ్వకుండా లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే వారి స్థానంలో అర్హులైన భర్త లేక భార్యకు రెండున్నరేళ్ల నుంచి ఇస్తూ వస్తున్నారు. దీంతో అర్హులైన కొత్తవారు నిత్యం పంచాయతీ కార్యాలయాలు, మండల పరిషత్‌ల చుట్టూ పింఛన్ల కోసం ప్రదక్షిణలు చేసేవారు. ఎమ్మెల్యేలు, నాయకులు కలిసిన చోటల్లా దండాలు పెట్టేవారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం కనికరించి.. ఆగస్టు 15న కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై బ్యాంకు ఖాతాలోనే..
జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 1,02,976 మం
ది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. నెలవారిగా రూ.24.83 కోట్ల మేర నిధులు వారికి అందజేస్తున్నారు. దివ్యాంగులకు రూ.4,016 చొప్పన పింఛను ఇస్తుండగా.. ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు. వీరికి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నారు. అయితే ఇక నుంచి పింఛన్లు బ్యాంకు ఖాతాల ద్వారానే అందజేయాల ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే పోస్టా ఫీసుల్లో తీసుకునే వా రికి సైతం బ్యాంకుల ద్వారా ఇచ్చే విధంగా ఖాతాలు తెరిపించారు. ఇక నుంచి పింఛను లబ్ధిదారుల అందరూ బ్యాంకుల ద్వారానే పెన్షన్ పొందాల్సి ఉంటుంది. వారందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాంకుకు వెళ్లి ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అప్‌డేట్ చేయించుకోవాలనే నిబంధన ఉంది. అయితే 2022 ఆగస్టు 31 నుంచి ఈ పథకం ద్వారా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులు పింఛన్లు ఇస్తామని ప్రకటన వెలువడగానే ఆనందపడుతున్నారు.
దివ్యాంగులు 12,014
అనర్హులవి ఏరివేత..
ఇటీవల ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ (లైవ్ అథెంటికేషన్) ప్రక్రియ నిర్వహించింది. మంత్ర యాప్ ద్వారా లబ్ధిదారుడి ఫొటో క్యాప్చర్ చేసి వివరాలు నమోదు చేశారు. ఆ ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసింది. జిల్లాలో ఉన్న పింఛన్ల లబ్ధిదారుల్లో దాదాపు 2,373 మంది చనిపోయినట్లు గుర్తించారు. మరో 1,860 మంది అందుబాటులోకి రాలేదని తేలింది. మొత్తంగా దాదాపు 4,233పైగా పాత లబ్ధిదారుల పింఛన్లు రద్దయ్యే అవకాశం
ఉంది.
ఆదేశాలు రాలేదు..
కొత్త పింఛన్ల పంపిణీపై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సూచనలు వస్తే వెంటనే నిబంధనల ప్రకారం కొత్త పింఛన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం.
– చిన్న ఓబులేషు, డీఆర్‌డీఓ
ఏ పని చేసుకోలేను..
నాకిప్పుడు 66 సంవత్సరాలు. గత మూడు సంవత్సరాల నుంచి పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు చేతకాక పోవడంతో ఏ పని చేసుకోవడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. ప్రభుత్వం త్వరగా పింఛన్ ఇచ్చేలా చూడాలి.
– బాలయ్య, జూపల్లి, చారకొండ మండలం
వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు
ఆనందంలో అర్హులైన లబ్ధిదారులు
కొత్తగా మరో 50 వేల మందికిపైనే అవకాశం
జిల్లాలో ఇప్పటికే 1,02,976 మంది లబ్ధిదారులు
బీడీ
23
కల్లుగీత
688


