ఎస్‌జీఎఫ్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ సందడి

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

పాఠశాల, కళాశాల స్థాయిలో క్రీడలు

తెలంగాణ స్కూల్‌గేమ్స్‌ షెడ్యూల్‌ విడుదల

వచ్చేనెల మొదటి వారం నుంచి నాలుగు దశల్లో పోటీల నిర్వహణ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పాఠశాల, కళాశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అండర్‌ 14, అండర్‌–17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా మండలస్థాయి నుంచి మొదలుకొని జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తారు. ఎంతో మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదిగి తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడలు విద్యార్థులకు ఒక వేదికలా ఉపయోగపడుతున్నాయి.

● ప్రతి ఏడాది పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం అనంతరం జిల్లాలోని పీఈటీలతో సమావేశం నిర్వహించి, ఎస్‌జీఎఫ్‌ పోటీల ఎంపికలపై నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు నుంచి ఈ ఏడాది స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడాపోటీలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలకు 2026–27 సంవత్సరానికి సంబంధించి డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ క్రీడా షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేశారు. నాలుగు దశల్లో ఎస్‌జీఎఫ్‌ క్రీడాపోటీలు జరగనున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్‌ నాలుగో వారం వరకు నాలుగు దశల్లో ఎస్‌జీఎఫ్‌ క్రీడలు జరగనున్నాయి. మండల, జిల్లా, ఉమ్మడి జిల్లా (జోనల్‌), రాష్ట్రస్థాయిల్లో ఎస్‌జీఎఫ్‌ క్రీడాపోటీలు జరగనున్నాయి. జిల్లాల ఎంపిక పోటీలను నిర్వహించుకొని పాత ఉమ్మడి జిల్లా జట్టుగా ఏర్పడి రాష్ట్ర పోటీలకు హాజరుకానున్నారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడా షెడ్యూల్‌ విడుదలకావడంతో ఇక క్రీడల సందడి నెలకొనుంది.

ఈవెంట్‌ క్రీడలు నిర్వహించే సమయం

మండలస్థాయిలో టోర్నీలు ఆగస్టు మొదటి, రెండో వారం

జోనల్‌ టోర్నీ కమ్‌ సెలక్షన్స్‌(అంతర్‌ మండలాలు) ఆగస్టు మూడో వారం

ఉమ్మడి (జోన్‌) జిల్లాస్థాయి టోర్నీకమ్‌ సెలక్షన్స్‌ సెప్టెంబర్‌ రెండో వారం

రాష్ట్రస్థాయి పోటీలు (పది ఉమ్మడి జిల్లాలస్థాయి) సెప్టెంబర్‌ నాలుగో వారం

ఎస్‌జీఎఫ్‌ వివరాలు..

పకడ్బందీగా నిర్వహిస్తాం...

ఈ ఏడాది అండర్‌–14, అండర్‌–17 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడాపోటీలను వ్యాయా మ ఉపాధ్యాయుల సహకారంతో పకడ్బందీగా నిర్వహిస్తాం. డీఈఓ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలోని పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహిస్తాం. గత ఏడాది వనపర్తి జిల్లాలో నాలుగు ఎస్‌జీఎఫ్‌ హాకీ టోర్నీలు నిర్వహించాం. ఈ ఏడాది కూడా జిల్లాకే ఏమైనా రాష్ట్రస్థాయి టోర్నీలు కేటాయిస్తే విజయంతంగా నిర్వహిస్తాం.

– బి.కుమార్‌, జిల్లా ఎస్‌జీఎఫ్‌

కార్యనిర్వాహక కార్యదర్శి, వనపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement