ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగు చేయాలి

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

పాన్‌గల్‌: ఎల్‌నినో నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి, ఏడీఏ తిప్పేస్వామి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని శాగాపూర్‌, శాగాపూర్‌తండాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏడీఏ, మల్లాయిపల్లిలో డీఆర్డీఓ పాల్గొని మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే కంది, మినుము, జొన్న వంటి పంటలతో పాటు అంతర పంటలుగా కంది–మినుము, ఆముదం–మినుముతో పాటు టమాటా, బెండకాయ, చిక్కుడు వంటి కూరగాయాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, మల్చింగ్‌, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ సాగునీటి పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్‌నినో ప్రభావంపై ముద్రించిన కరపత్రాలను రైతులతో కలిసి అధికారులు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో అసిస్టెంట్‌ జల శాస్త్రజ్ఞుడు ఉమేష్‌, తహసీల్దార్‌ కార్తీక్‌రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఏఈఓలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement