డిజిటలైజేషన్‌లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటలైజేషన్‌లో వేగం పెంచాలి

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

కొల్లాపూర్‌/పెద్దకొత్తపల్లి/కోడేరు: సర్‌పై బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సీరియస్‌గా వ్యవహరించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం ఆయన కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, కోడేరులోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సర్‌ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు పలు సూచనలు చేశారు. మండలాల వారీగా ఇప్పటివరకు జరిగిన ఓటర్ల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ వివరాలను మంత్రి తెలుసుకున్నారు. నిరక్షరాస్యులైన ఓటర్లు చాలా మంది ఇప్పటివరకు ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, వారి ఇళ్ల వద్దకు బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు వెళ్లి వారికి అవసరమైన సహయం అందించాలని సూచించారు. బూత్‌ల వారీగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాసులు, జమీల్‌, కాంగ్రెస్‌ పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు సత్యం, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్‌రావు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాద క్షతగాత్రుడికి చేయూత

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సింగోటం సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మండలంలోని నార్లాపూర్‌కు చెందిన కావలి మల్లేష్‌ ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆ సమయంలో కొల్లాపూర్‌ పర్యటనను ముగించుకొని అటుగా వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గమనించి తన ఎస్కాట్‌ వాహనంలో క్షతగాత్రుడిని ఎక్కించి వెంటనే కొల్లాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కొల్లాపూర్‌లో ప్రథమ చికిత్స చేసిన తర్వాత వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement