కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

అమ్రాబాద్‌: కేసుల నమోదు, పరిష్కారంలో పోలీస్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జిపాటిల్‌ ఆదేశించారు. అమ్రాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం డీఎస్పీ పల్లె శ్రీనివాసులు తో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్పీకి గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్పీ పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు తిరిగి పరిశీలించారు. కేసుల నమోదు, క్రైమ్‌ రికార్డులు పరిశీలించిన అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ, సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ క్రైమ్‌రేట్‌ తగ్గించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ చంద్రయ్య, ఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement