పుంజుకున్న ‘సర్‌’.. | - | Sakshi
Sakshi News home page

పుంజుకున్న ‘సర్‌’..

Jul 20 2026 12:50 AM | Updated on Jul 20 2026 12:50 AM

జిల్లాలో 71.62శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

ఇప్పటివరకు 5,24,015 ఎన్యూమరేషన్‌ ఫారాల నమోదు

గ్రామాల్లోనే ఓటుకు మొగ్గు.. పట్టణాల్లో తగ్గనున్న ఓట్లు

అచ్చంపేట: సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జిల్లాలో వేగం పుంజుకుంది. ఆదివారం నాటికి ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ 71.62 శాతం పూర్తయింది. ఇప్పటికే బీఎల్‌ఓలు ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేయగా.. ఓటర్లు తమ వివరాలు నింపి తిరిగి అందజేస్తున్నారు. అయితే కొందరు ఓటర్లు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో వారి సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. జల్లాలో మొత్తం 7,31,632 మంది ఓటర్ల నుంచి అందిన ఎన్యూమరేషన్‌ ఫారాల్లో ఇప్పటి వరకు 5,24,015 ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియలో 2002 ఓటరు జాబితాను లింక్‌ చేశారు. అప్పటి ఓటరు జాబితాలో పేరులేని వారు 24ఏళ్ల క్రితం నాటి తల్లిదండ్రుల వివరాలను, అసెంబ్లీ నియోజకవర్గం పేరు, బూత్‌ నంబరు, సీరియల్‌ నంబర్లను ఓటర్లే వెతుకోవాల్సి వస్తోంది. పెళ్లికి ముందే ఓటు హక్కు పొంది.. ఆ తర్వాత ఇంటిపేరు మార్చుకున్న మహిళల పరిస్థితి సైతం ఇబ్బందిగా మారింది.

అక్షరం తేడా ఉన్నా..

బీఎల్‌ఓలతో పనిలేకుండా స్వయంగా ఓటర్లు ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వారు ఆన్‌లైన్‌లో నమోదుకు యత్నించినప్పటికీ.. ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డుల్లో ఆక్షరం తేడా ఉన్నా పూర్తిచేసిన దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. బీఎల్‌ఓలను సంప్రదించాలని సూచిస్తోంది.

నాయకుల తర్జన భర్జన..

రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఇటు మున్సిపాలిటీలు, అటు సొంతూళ్లలో ఓటు ఉంది. వారు ఓటు హక్కు ఎక్కడ ఉంచుకోవాలని తర్జనభర్జన పడుతున్నారు. అలాగే చాలా మంది అధికారులకు సొంతూరితో పాటు వారు పనిచేసిన చోట ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఏదో ఒక చోట ఉంచుకోవాల్సి ఉండటంతో వారు సొంతూరిలోనే నమోదు చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రక్రియ వేగవంతం..

ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్త యింది. డిజిటలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి ఇంటికీ బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు వెళ్లి వివరాలు సేకరించి.. 2002 ఓటరు జాబితా ప్రకారం వివరాలు నమోదు చేయాలి. ఓటర్ల కు ఓటు ప్రాధాన్యతను తెలియజేయాలి. వే గంగా ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకు రా జకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి.

– యాదగిరి, ఆర్డీఓ, అచ్చంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement