బలోపేతం దిశగా బడులు | - | Sakshi
Sakshi News home page

బలోపేతం దిశగా బడులు

Jul 20 2026 12:50 AM | Updated on Jul 20 2026 12:50 AM

అప్పాయపల్లి ప్రాథమికోన్నతపాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్య

బడిబాటతో సత్ఫలితాలు

దరఖాస్తుల ఆహ్వానం

కందనూలు: జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ మదన్మోహన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, కెమిస్ట్రీ, జువాలజీ, డెయిరీ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై, కనీసం 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) సాధించిన వారు అర్హులని తెలిపారు. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలలోగా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్‌ సూచించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

నాగర్‌కర్నూల్‌ రూరల్‌/అచ్చంపేట రూరల్‌: ఆర్టీసీ ఉద్యోగుల సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట ఆర్టీసీ డిపోల వద్ద ఉద్యోగులతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విలీనం కంటే ముందున్న సమస్యలను ఎలా పరిష్కరించబడాలనే విషయంలో విలీన కమిటీ అధ్యయనం చేయాలన్నారు. కార్మికుల సమష్టి పోరాటం మూలంగా 11శాతం వేతన సవరణ జరిగిందన్నారు. కార్మిక వర్గానికి లాభం జరగాలంటే సంపూర్ణ ఉద్యోగ భద్రత, పని భారం, వేధింపులు లేని ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించబడాలన్నారు. సమావేశాల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, రీజనల్‌ కార్యదర్శి వెంకటయ్య, నంది వెంకటేశ్‌, బాషా, అర్జున్‌, వర్దనమ్మ, చింతలయ్య, కృష్ణ, చెన్నకేశవులు, గోపాల్‌, విజయ్‌, ఆంజనేయులు, డానియిల్‌, శ్రీను, రాములు ఉన్నారు.

– వివరాలు 9లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement