జగన్నాథుడి రథ వైభవం | - | Sakshi
Sakshi News home page

జగన్నాథుడి రథ వైభవం

Jul 17 2026 3:46 AM | Updated on Jul 17 2026 3:46 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: పాలమూరు నగరంలో గురువారం శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ముందుగా ఉత్సవ మూర్తులకు హారతి, పూజలు చేశారు. భక్తుల జై జగన్నాథ, హరే రామ్‌... హరేకృష్ణ నామస్మరణతో పాలమూరు పట్టణంలో భక్తిభావం ఉట్టిపడింది. శ్రీజగన్నాథ రథయాత్ర దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులు రెండు వైపుల నిలుచొని రథాన్ని లాగారు. మెట్టుగడ్డ పిల్లలమర్రి చౌరస్తా నుంచి ప్రారంభమైన రథయాత్ర న్యూటౌన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, అశోక్‌టాకీస్‌ చౌరస్తా, వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, రాంమందిర్‌ చౌరస్తా, అశోక్‌టాకీస్‌ చౌరస్తా, క్లాక్‌టవర్‌ నుంచి తిరిగి బస్టాండ్‌ మీదుగా మల్లికార్జున్‌ చౌరస్తా నుంచి టీటీడీ కల్యాణ మండపం వరకు చేరింది. రథయాత్రలో ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని దేవతామూర్తులకు హారతి, ప్రత్యేకపూజలు చేసి రథాన్ని లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement