వనపర్తిటౌన్: మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ మీట్‌కుగాను సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 పోటీలకు 18.07.2012–17.07.2014 మధ్య జన్మించిన బాలబాలికలు, అండర్–16 పోటీలకు 18.07.2010–17.07.2012 మధ్య జన్మించిన వారు, అండర్–18 పోటీలకు 18.07.2008–17.07.2010 మధ్య జన్మించిన వారు, అండర్–20 పోటీలకు 18.07.2006 – 17.07.2008 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అండర్–14లో 600 మీటర్లు, ట్రయోత్లోన్–ఏ,బీ,సీ, అండర్–16లో వెయ్యి, 2 వేల మీటర్లు, అండర్–18లో 800, 1,500, 3 వేల మీటర్లు, అండర్–20లో 800, 1,500, 5 వేలు, 10 వేల మీటర్లు, ఉమెన్ ఆండ్ మెన్ కేటగిరీలో 800, 1,500, 3 వేలు (ఉమెన్), 5 వేల మీటర్లు (మెన్ ), 10 వేల మీటర్ల పరుగు పందెం పోటీలు ఉంటాయని వివరించారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు స్థానిక స్టేడియం గ్రౌండ్‌లో రిపోర్ట్ చేయాలని.. పూర్తి వివరాలకు సెల్‌నంబర్ 94413 53375 సంప్రదించాలని సూచించారు.


