రోడ్ల పరుగులు | - | Sakshi
Sakshi News home page

రోడ్ల పరుగులు

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

ఎంపిక చేసిన రోడ్లు ఇవే.. ఆర్‌బీఐతో ఒప్పందం..

పాలమూరులో

వనపర్తి– జడ్చర్ల ప్రధాన రహదారిలో బుద్దారం నుంచి మరికల్‌ వరకు 33 కి.మీ., రోడ్డును 10 మీటర్లుగా విస్తరించి ఆధునికీకరించనున్నారు. వనపర్తి– బుద్దారం 11.60 కి.మీ., రోడ్డు స్టెతన్‌ చేయనున్నారు.

మంగనూర్‌ నుంచి తెలకపల్లి వరకు 45.50 కి.మీ రోడ్డును ఆధునికీకరించేందుకు టెండర్లు ఆహ్వానించారు.

బల్మూర్‌– నాగర్‌కర్నూల్‌ (పీడబ్ల్యూడీ) 13 కి.మీ., రోడ్డును రెండు వరుసలుగా విస్తరిస్తారు.

అచ్చంపేట– రాకొండ రహదారిలో ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్‌, మామిళ్లపల్లి, రాకొండ వరకు 28.40 కి.మీ మేర రెండు వరుసలుగా నిర్మిస్తారు.

అమ్రాబాద్‌– మద్దిమడుగు రహదారిలో పదర, వంకేశ్వరం, చిట్లంకుంట, ఉడిమిళ్ల, ఇప్పలపల్లి వరకు 34.20 కి.మీ., సింగిల్‌ రోడ్డును రెండు వరుసలుగా విస్తరిస్తారు.

పెంట్లవెల్లి ఎక్స్‌రోడ్డు నుంచి వనపర్తి మార్గంలో కొండూరు, తూంకుంట మీదుగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌ వరకు 0 నుంచి 3 కి.మీ., మేర రెండు వరుసలుగా విస్తరణ, 3 నుంచి 28.16 కి.మీ వరకు డబుల్‌ లైన్‌ తారు పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.

చిన్నంబావి– చెల్లెపాడు 14.20 కి.మీ., రోడ్డును ఆధునికీకరించనున్నారు.

కొల్లాపూర్‌– వనపర్తి మధ్య కేతేపల్లి నుంచి వీపనగండ్ల వరకు 11.10 కి.మీ., సింగిల్‌ రోడ్డును డబుల్‌గా విస్తరించనున్నారు.

వనపర్తి– ఆత్మకూర్‌ రహదారిలో పరిధిలో 0 నుంచి 8 కి.మీ., దేవరకద్ర నియోజకవర్గంలో 8 నుంచి 27 కి.మీ., రోడ్డును బీటీగా మారుస్తారు.

మక్తల్‌ నియోజకవర్గ పరిధిలో వనపర్తి– ఆత్మకూర్‌ రోడ్డులోని 27.కి.మీ నుంచి 31 కి.మీ., వరకు, ఆత్మకూర్‌– మర్రికల్‌ రోడ్డు 13.40 కి.మీ., విస్తరిస్తారు.

అలంపూర్‌– అయిజ, ఎరిగేర 57 కి.మీ, గద్వాల– ఎర్రవల్లి 9 కి.మీ., బలిగెర– మాచర్ల 5 కి.మీ., గద్వాల– రాయచూర్‌ 22 కి.మీ., గట్టు– మాచర్ల 5 కి.మీ., 6 ప్రధాన రహదారులను హ్యామ్‌ పద్ధతిలో విస్తరించనున్నారు.

మహబూబ్‌నగర్‌– నవాబ్‌పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్‌– మినాస్‌పూర్‌ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్‌– నారాయణపేట (ఊట్కూర్‌ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్‌– తిర్మలాపూర్‌ 10 కి.మీ., మహబూబ్‌నగర్‌– మంగనూర్‌, వేపూర్‌ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్‌పల్లి, కురుమూర్తి టెంపుల్‌ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్‌– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్‌కొండ (మల్కాపూర్‌, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్‌– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరిచి.. ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయని ఆశిస్తున్నారు.

అచ్చంపేట: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా.. మౌలిక సదుపాయాలు కావాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా.. మెరుగైన రోడ్డు, రవాణా సదుపాయాలు ఉండాలి. ఈ మేరకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రహదారులను విస్తరించడంతోపాటు మరమ్మతు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) రోడ్ల టెండర్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హ్యామ్‌ విధానం ద్వారా రహదారులను అభివృద్ధి చేయనుంది. దీంతో జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్ల ముఖచిత్రం మారబోతోంది. ఇందులో భాగంగా మొదటి దశలో మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ సర్కిల్‌లో మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి 2 ప్యాకేజీల్లో మొత్తం 378.04 కి.మీ., మేర రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.912.67 కోట్లు మంజూరు చేస్తూ టెండర్లు ఆహ్వానించింది. అలాగే వనపర్తి సర్కిల్‌లో వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో మొదటి దశలో 18 రహదారులను 2 ప్యాకేజీల కింద ఎంపిక చేసిన మొత్తం 319.4 కి.మీ., మేర నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.697.77 కోట్లు కేటాయించారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి కాగా చివరి దశలో ఉంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది.

హ్యామ్‌ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు ద్వారా రుణం పొంది రోడ్లను నిర్మిస్తారు. బిల్లులకు ఇబ్బందులు లేకుండా ఆర్‌బీఐతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టర్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానం ప్రకారం కాంట్రాక్టర్‌ నిర్మించిన రహదారులను 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

హ్యామ్‌ రోడ్లలో ఉమ్మడి జిల్లాకు పెద్దపీట

నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ

రూ.1,610.44 కోట్లతో 44 కొత్త

రహదారుల నిర్మాణానికి ప్రణాళిక

ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం

మారనున్న గ్రామీణ ప్రాంత

రహదారుల ముఖచిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement