చట్టాలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన తప్పనిసరి

Jul 1 2026 1:28 AM | Updated on Jul 1 2026 1:28 AM

వెల్దండ: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కల్వకుర్తి కోర్టు సివిల్‌జడ్జి ముదికొండ రాజు అన్నారు. మంగళవారం వెల్దండ రైతువేదికలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలు, మహిళలపై వేధింపులు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అందరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. అనంతరం పలు చట్టాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మట్ట యాదమ్మ, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేష్‌, న్యాయవాది చిందం కృష్ణయ్య, వెంకటయ్యగౌడ్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.

వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు

అమ్రాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ అన్నారు. మంగళవారం పదర ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో జరిగిన ప్రసవాలు, ఓపీ సేవలు, మందుల నిల్వలను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ పరిధిలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారికి ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాజగోపాలాచారి, కుమార్‌, పదర వైద్యాధికారిణి పావని ఉన్నారు.

విద్యార్థులకు వసతులు కల్పించాలి

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి.. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల జూనియర్‌ కళాశాలలో రెండు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అదే విధంగా స్కావెంజర్‌ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బాలికల ఉన్నత పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని.. నూతన గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆర్‌.శ్రీనివాసులు కందికొండ గీత, పొదిల రామయ్య మధు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement