ఉప్పునుంతల: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గూడు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దాపూర్‌లో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారంతో లబ్ధిదారులు పక్కా ఇళ్లు నిర్మించుకొని సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం ఉన్నప్పుడు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయే తప్పా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్క పేదవాడికి ఇళ్లు మంజూరైన దాఖలాలు లేవని మండిపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ, ఉప్పునుంతల సర్పంచు సీహెచ్ శ్రీనివాసులు, నా యకులు నర్సింహరావు, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించరా?
కల్వకుర్తి రూరల్: క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు ప్రశ్నించారు. ఆదివారం కల్వకుర్తిలో పార్టీ ఏరియా కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 120 నుంచి 72 డాలర్లకు పడిపోయినప్పటికీ ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించడం లేదన్నారు. ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేయడం దారుణమన్నారు. ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని.. వెంటనే ధరల నియంత్రణ చర్యలు చేపట్టకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.ఆంజనేయులు, కృష్ణారెడ్డి, చింత ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, చెన్నయ్య, బక్కయ్య, సిద్ధయ్య ఉన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
కందనూలు: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను సోమవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్న ట్లు నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి 5 గంటల వర కు 99592 26288 నంబర్‌ను సంప్రదించి.. రవాణాపరమైన సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచన లు అందించాలని ఆయన కోరారు.


