కోడేరులో పీర్ల సవారీలో
పాల్గొన్న భక్తులు
కోడేరు/తెలకపల్లి: జిల్లాలో మొహర్రం ఉత్సవాలు ముగిశాయి. శనివారం కోడేరు, తెలకపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చివరి రోజు పీర్ల సవారీ ఉత్సాహంగా సాగింది. తెల్లవారుజామునే పీర్లను లేపి ఊరేగింపు చేపట్టారు. మొహర్రం ఉత్సవాలతో కోడేరు మండలకేంద్రం జనసంద్రంగా మారింది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద పీర్లకు ఎబిజ్ కొట్టేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు భక్తులు పొట్టేళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు మటికిలతో నైవేద్యం సమర్పించారు.
నిలకడగా ఫుడ్ పాయిజన్ బాధితుల ఆరోగ్యం


