‘మద్దతు’ ఇవ్వని మార్క్‌ఫెడ్‌! | - | Sakshi
Sakshi News home page

‘మద్దతు’ ఇవ్వని మార్క్‌ఫెడ్‌!

Mar 6 2026 8:08 AM | Updated on Mar 6 2026 8:08 AM

దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్‌ఫెడ్‌ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్‌గా మారిన ప్రైవేట్‌ వ్యాపారులు మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్‌ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్‌పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్‌ఫెడ్‌, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్‌లో ఎలా గోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూ పెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

2.11 లక్షల ఎకరాల్లో సాగు.. ఎంఎస్‌పీ బహుజాగు

2025–26 యాసంగి సీజన్‌కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొ చ్చని భావించి ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్‌ సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువసగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ తమ పెట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.

2025–26లో జిల్లాల వారీగా

మొక్కజొన్న సాగు విస్తీర్ణం..

మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్‌’..

క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి

ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.2,400..

‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు

ఉమ్మడి వరంగల్‌లో 2.11 లక్షల

ఎకరాల్లో సాగు

7.56 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక

అన్నదాతల ఆందోళన

జిల్లా సాగు విస్తీర్ణం

( ఎకరాల్లో...)

హనుమకొండ 58,000

వరంగల్‌ 46,000

జనగామ 30,150

మహబూబాబాద్‌ 40,230

ములుగు 20,125

జేఎస్‌ భూపాలపల్లి 16,995

మొత్తం 2,11,500

ఖర్చు అంశం సుమారు ఖర్చు

రూ.లు)

భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000

విత్తనాలు (హైబ్రిడ్‌) 3,000 – 4,000

ఎరువులు 5,000 – 7,000

మందులు (కీటక నివారణ) 3,000 – 5,000

కూలీల ఖర్చు 6,000 – 8,000

నీటి ఖర్చు 3,000 – 5,000

కోత – రవాణా 4,000 – 6,000

మొత్తం ఖర్చు 28,000 – 40,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement