జిల్లాకు ఒకటి చొప్పున నిర్మాణం
న్యూస్‌రీల్
పక్కా భవనాలు లేక అవస్థలు
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
ఏటూరునాగారం: కార్పొరేట్ తరహాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలివిడతలో జిల్లాకు ఒకటి చొప్పున నిర్మించనుంది. ఒక్కొక్క దానికి రూ.30 లక్షలు వెచ్చించనుంది. ఈ మేరకు ఇప్పటికే శిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే జిల్లాలోని 564 అంగన్‌వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.2లక్షలు ఒక్కో సెంటర్‌కు ఇవ్వనుంది. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆరోగ్యలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ పోషణ పథం పేరిట చిన్నారులు, బాలికలు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనుంది.
రక్తహీనత నివారించేందుకు..
కౌమార బాలికల్లో (14–18 ఏళ్లు) పోషకాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ఏడాదిలో వందరోజుల ప్రణాళిక అమలు చేయనుంది. ప్రత్యేక న్యూట్రీషియన్ ప్యాకేజీ కింద మల్టీమిల్లెట్ చిక్కి, ఇన్‌స్టంట్ మిక్స్ (ఉప్మా, కిచిడి) అందిస్తారు. బాలామృతం, బాలామృతం ప్లస్, ఫార్ములేషన్‌లో మరిన్ని మైక్రో న్యూట్రియేంట్లు ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రీ ప్రైమరీ టీచర్లకు ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా అర్హత, ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్లకు నూతన విద్యావిధానం కింద సర్టిఫికేషన్ కోర్సు నిర్వాహణ చేపట్టనుంది. ప్రీస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్ట్, బూట్లు, సాక్సులు అందించాలని, ఏడాదికి 300 రోజులు 100 మిల్లీలీటర్ల పాలు, 25 గ్రాముల అల్పాహారం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంది. అద్దె భవనాల్లోని అంగన్‌వాడీలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంది.
ఏజెన్సీలో తక్కువ బరువు పిల్లలే ఎక్కువ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే నూతన పథకాలను ఏజెన్సీలో అమలు చేయనుంది. తక్కువ, అతి తక్కువ బరువు ఉన్న పిల్లలకు మంచి పౌష్టికాహారం అందజేసి వారి బరువు, ఎత్తు పెరిగేందుకు ఆరోగ్య లక్ష్మీని మరింత పటిష్టంగా అమలు చేయనున్నారు.
జిల్లాలో 30 కొత్త అంగన్‌వాడీ భవనాలకు నిధులు మంజూరు అయ్యాయి. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.2 లక్షలు కేటాయించగా వాటితో పనులు చేపట్టడం జరుగుతుంది. అంగన్‌వాడీ కేంద్రాలను మరింత మెరుగుపర్చుతాం.
– ప్రేమలత, డీడబ్ల్యూఓ, ములుగు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన
శిశు సంక్షేమశాఖ
అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతుకు రూ.2లక్షలు కేటాయింపు
జిల్లాలో 664 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో 664 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను 564 కేంద్రాలకు శాశ్వత భవనాలు ఉండగా 100 కేంద్రాలకు పక్కా భవనాలు లేకుండా ఉన్నాయి. వీటిని పూర్తిస్తాయిలో నిర్మించడానికి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయించే దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో శాశ్వత అంగన్‌వాడీ కేంద్రాలు నెలకొల్పనున్నారు.


