వాజేడు: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటను రైతులు అమ్ముకోవాలంటే బస్తాల్లో నింపాల్సిందే. దీని కోసం కొందరు యువకులు ఒక జట్టుగా ఏర్పడి బస్తాల్లో మిర్చిని నింపుతారు. రైతులు ఒక్కొక్కరికి రూ.500 చెల్లించి బస్తాల్లో కాయలను తొక్కిస్తుంటారు. ఒక్క బస్తాలో 30 కేజీల నుంచి 50 కేజీలు ఉండేలా చూసి తొక్కిస్తారు. వాటిని మార్కెట్లో విక్రయించడానికి అనుకూలంగా ఉండటంతో పాటు ఎండిన మిర్చి పాడు కాకుండా ఉంటుంది. ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి వరకు ఈ పనిని చేస్తుంటారు. ఎంత ఎండ ఉన్నా యువకులు మిర్చి బస్తాల్లో నింపుతారు.


