ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విజిలెన్స్ డ్రగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ స్టోర్, మెడికల్ కళాశాల సెంట్రల్ స్టోర్‌ను విజిలెన్స్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జన్ను కిరణ్‌కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన 50 ఇంజక్షన్లు లభ్యం కావడంతో విచారణ చేపట్టారు. ప్రభుత్వం నుంచి పునిస్కా కంపెనీకి చెందిన 0217 బ్యాచ్ నంబర్ కలిగిన 1,700 మెట్రోనైడోజనల్ ఇంజక్షన్లు సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌కు సరఫరా కాగా ములుగు ఆస్పత్రికి 1,286 ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని తెలిపారు. మిగిలిన 414 నిల్వ ఉన్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజ్ చేయాల్సిన మందులను ఇష్టానుసారంగా నిల్వ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.


