బంజారాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
యువత క్రీడల్లో రాణించాలి
ములుగు: బంజారాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ గుడి శివారులో సేవాలాల్ మహరాజ్ ఆల య నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ చింత నిప్పుల చంద్రకళ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సేవాలాల్ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. బంజారాల కులస్తులు భ వన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం బంజారాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క సేవా లాల్ జయంతి వేడుకల్లో మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మా ట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ కనబర్చాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్, పూజారులు రమేష్‌గిరి, కిషన్, ఐటీడీఏ అధికారి జనార్ధన్, రాహుల్, బంజారా కులస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
ములుగు రూరల్: కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రి బుధవారం పరిశీలించి మాట్లాడారు. భవనాన్ని నాణ్యతతో సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కను టీఎన్‌జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసి శాలువా కప్పి సన్మానించి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చైతన్య, లాల్‌నాయక్, ఉదయ్ కుమార్‌రెడ్డి, ప్రదీప్, భాస్కర్, శ్రీకాంత్, రవీందర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ధనసరి సీతక్క
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గ్రామీణ యువత క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. బాలకుమారస్వామి జాతరను పురస్కరించుకుని కొడిశాల (బిట్టుపల్లి)లో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలు బుధవారం ముగిశాయి. సర్పంచ్ మొగిలిపల్లి రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు మంచి స్పందన రావడం హర్షనీయమన్నారు. ఈ పోటీల్లో కొత్తగూడెం– రంగాపూర్ జట్టు మొదటి స్థానంలో నిలిచి బహుమతి రూ.15,016లను కై వసం చేసుకోగా రెండో స్థానంలో నిలిచిన చింతకుంట జట్టుకు రూ. 12,016, మూడో స్థానంలో నిలిచిన ముళ్లకట్టరాంపూర్ జట్టుకు రూ. 8,016, నాలుగో స్థానంలో నిలిచిన కొడిశాల జట్టుకు రూ.5,016లను అందజేశారు. అలాగే షీల్డులను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, డీసీఆర్‌బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, పస్రా సీఐ దయాకర్, ఎస్సైలు కమలాకర్, తాజోద్దీన్, మధుకర్, నిర్వహకులు మొగిలిపల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి


