
సమ్మక్కసాగర్‌లోకి 11,02,460 క్యూసెక్కుల నీరు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీకి గోదావరి వరద భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ఉదయం వరకు బ్యారేజీలోకి 9,40,290 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రాగ సాయంత్రం వరకు 11,02,460కు పెరిగింది. దీంతో బ్యారేజీ 59 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 83మీటర్లు కాగా సామర్థ్యం మించి 84.50 మీటర్లకు చేరింది. అలాగే ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి మండలంలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీతో పాటు, లోతట్టు గ్రామాలలో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడారు. భారీ వర్షాల దృష్య గోదావరిలోకి భారీగా నీరు చేరుతుందన్నారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లోతట్టు గ్రామాలు ముప్పునకు గురయ్యే అవకాశం ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం వస్తే 100కు డయల్ చేయాలన్నారు.