
శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపునకు (శనివారం) నుంచి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) (ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు)ను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు అధికారులు సెంటర్ బోర్డ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక సహకారంతో టీజీబీఐఈ – ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతీరోజు రెండు సార్లు (ఉదయం, మధ్యాహ్న భోజనం తర్వాత) హాజరు తీసుకుంటారు. ఈమేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. కళాశాలకు ఏ విద్యార్థి అయినా హాజరుకాకుంటే అతడి తల్లిదండ్రుల ఫోన్‌కు సందేశం వెళ్తుంది. ఈ హాజరును ఆ కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు కూడా పర్యవేక్షిస్తారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుపై గత గురువారం ఆయా జిల్లాల్లో డీఐఈఓలు.. కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహించి హాజరు అమలు విధానాన్ని తెలియజేశారు. హనుమకొండ, వరంగల్‌లో డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్‌సుమన్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
జిల్లాల వారీగా ప్రభుత్వ
జూనియర్ కాలేజీలు, విద్యార్థుల వివరాలు
రోజుకు రెండుసార్లు హాజరు నమోదు ● గైర్హాజరైతే తల్లిదండ్రుల ఫోన్లకు సమాచారం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
2,900
2,013
ప్రతీ జిల్లాకు ఇద్దరికి ఏఐ చాంపియన్లుగా శిక్షణ
ఇంటర్ విద్యలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర బోర్డు నిర్ణయించింది. విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాల అ భివృద్ధి, సరికొత్త సాంకేతికత పరిచయం కోసం ఏఐని విని యోగించుకోనున్నారు. దీనిపై పట్టున్న సిబ్బందిని గుర్తించి ఏఐ చాంపియన్లుగా ఎంపిక చేసింది. ప్రతీ జిల్లాలోని అకడమిక్ మానిటరింగ్ సెల్‌లోని ఇద్దరు లెక్చరర్లు, ఒక లైబ్రేరియన్, ప్రతీ జిల్లాకు ఏఐ చాంపియన్లుగా ఎంపికై న ఒక లెక్చరర్, నాన్‌టీచింగ్ సిబ్బందికి శుక్రవారం హైదరాబాద్‌లో సంబంధిత ఉన్నతాధికారులు ఏఐ ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు, వినియోగంపై శిక్షణ ఇచ్చారు.
● అధ్యాపకులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీజీబీఐ ఈ –ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో విద్యార్థుల ఫొటోతో సహా వివరాలు నమోదు చేయాలి. ● తరగతి ప్రారంభమయ్యాక స్మార్ట్ ఫోన్‌లో ఆ యాప్ ద్వారా కెమెరా ఓపెన్ చేసి వీడియా మాదిరిగా కూర్చున్న విద్యార్థులను తీసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా ఫొటో క్యాప్చర్ అయి హాజరు నమోదవుతుంది. ● ఈ విధానంతో 15నుంచి 20 సెకన్లలోనే 80మంది విద్యార్థుల వరకు హాజరు నమోదు చేయవచ్చని చెబుతున్నారు. ● ముఖ హాజరుకు శుక్రవారంనుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇంకా చేపట్టనివారు ఉంటే ఈనెల 23న చేపడతారు. ● కళాశాలల సమయం ఉదయం 9:30 గంటల నుంచి ప్రతీ తరగతి గదిలోని తొలి పీరియడ్ తీసుకునే అధ్యాపకుడు విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు చేస్తారు. ● మళ్లీ మధ్యాహ్నం లంచ్ తర్వాత 2గంటలకు మరోసారి నమోదు చేస్తారు.
1,272
1,000
విద్యార్థులకు
రోజుకు
రెండు సార్లు
హాజరు
మానుకోట
1,350
1,200
734
821
520
535
యాప్ డౌన్‌లోడ్
విధానం తన
మొబైల్ ద్వారా చూపిస్తున్న
వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్
జనగామ
1,050
950
ఇంటర్‌లో
హాజరుశాతాన్ని
పెంచేందుకే..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంటోంది. ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థుల్లో మధ్యాహ్నం భోజనం కోసం కొందరు ఇంటికి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. తిరిగి రావడం లేదు. ఇంటివద్ద కాలేజీకి అని చెప్పి డుమ్మా కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత తక్కువగా రావడానికి కూడా విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకాకపోవడమే అనేది ఇంటర్‌బోర్డు అధి కారులు భావిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారంగానే ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది.
నేటినుంచే అమలు.. రిజిస్ట్రేషన్ షురూ

శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025