
నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే..
మంగపేట : పాఠశాలల నిర్వహణ, విద్యాబోధనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి వెళతారని కలెక్టర్ టీఎస్ దివాకర మంగపేట ప్రాథమికోన్నత పా ఠశాల ఉపాధ్యాయులను శుక్రవారం ఘాటుగా హె చ్చరించారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్, ప్రాథమికోన్నత పాఠశాల, పీహెచ్‌సీని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూపీఎస్ ఉపాధ్యాయులు విద్యాబోధన సక్రమంగా చేయడంలేదని, పాఠశాల నిర్వహణ, రికార్డులు సక్రమంగా లేకపోవడంతో నెలరోజుల్లో పద్ధతి మా ర్చుకోవాలని లేకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జెడ్పీ హెచ్‌ఎస్, యూపీఎస్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతీ రోజు భోజనం అందిస్తున్నారా రుచి గా ఉంటుందా.. లేదా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారంలో ఎన్ని రోజులు గ్రుడ్లు ఇస్తున్నారని అడగడంతో సరైన సమాధానం రాకపోవడంతో విద్యార్థులను ఇంగ్లిష్‌లో వారాలు స్పెల్లింగ్‌తో చెప్పమని అడగడంతో ఒక్కరుకూడా చెప్పకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి చెందారు. విద్యార్థులకు ఏం భోదిస్తున్నారు. అసలు ఏమి జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత, ఎందరు ఉపాధ్యాయులు ఉన్నారని విధులకు ఎంతమంది హాజరయ్యారని ఆరా తీశారు. విద్యార్థుల్లో కనీస పురోగతి కనిపించడం లేదని, విద్యార్థులకు హోంవర్క్ ఏమి ఇస్తున్నారని వాటిని చూపించాలని ఆదేశించారు. అయినప్పటికీ వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హెచ్‌ఎం ములకాల వెంకటస్వామి, ఉపాధ్యాయుడు సెలవు పెట్టారని ఎంఈఓ, జెడ్పీ హెచ్‌ఎస్ మేనక కలెక్టర్‌కు తెలిపారు. పాఠశాల నిర్వహణపై మీ పర్యవేక్షణ సక్రమంగా లేదని ఎంఈఓను సున్నితంగా హెచ్చరించారు. పాఠశాల రికార్డులు కూడా సక్రమంగా లేవని, నాలుగో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల తర్వాత సందర్శిస్తానని అప్పటి వరకు పాఠశాల నిర్వహణ, రికార్డులు సక్రమంగా ఉండాలని, విద్యార్థులల్లో మార్పు తీసుకురావాలని తెలిపారు.
పీహెచ్‌సీలో తనిఖీ
మండల కేంద్రంలోని పీహెచ్‌సీ నిర్వహణ, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. రోజువారీగా ఓపీ వివరాలు, డెంగీ, మలేరియా జ్వరాల నమోదు వివరాలను వైద్యాధికారి స్వప్నితను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నవారితో మాట్లాడారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్‌ఐ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సురేష్ ఉన్నారు.
పనుల జాతర ప్రారంభం
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కూలీలంద రూ వినియోగించుకోవాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఉపాధి హామీ అభివృద్ధి పనుల జాతర కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సంపత్‌రావుతో కలి సి శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రా మంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివాకర మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మొత్తం 266 పనులు చేపట్టామని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుడు రోజుకు రూ.307 లబ్ధి పొందాలన్నారు. పనుల్లో భాగంగా చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు క్యాటిల్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన, ఇంకుడు గుంతల నిర్మా ణం, నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కొంతమంది ఉపాధి, పారిశుద్ధ్య కార్మికులు దివ్యాంగులు కలిసి కలెక్టన్‌ను సన్మానించారు. ఇదిలా ఉండగా. ఎక్కువ పనులు చేసిన హసీనాబేగం, అస్మత్, సరస్వతి, మల్టీపర్పస్ వర్కర్ మేకల కిష్టయ్యను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కుమార్, ఈజీఎస్ ఏపీఓ చరణ్‌రాజ్ ఉన్నారు.
ఉద్యోగులకు కలెక్టర్ దివాకర హెచ్చరిక

నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే..