
కంకవనాల నర్సరీకి సన్నాహాలు
ఏటూరునాగారం: జిల్లాలోని అన్ని వర్గాల రైతులకు కంకవనాలను పెంచేందుకు అనువైన స్థలాలను పరిశీలించినట్లు అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ సంపత్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఏటూరునాగారం నర్సరీని ఏపీఓ వసంతరావుతో కలిసి సంపత్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఇండస్ట్రీ ఎన్‌జీఓ ద్వారా పది లక్షల కంకవనం మొక్కలను పెంచడానికి అనువైన స్థలం కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు వారు తెలిపారు. ఈ మొక్కలను ఇక్కడ పెంచి చుట్టూ పక్కల మండలాల్లోని రైతులకు ఈజీఎస్ ద్వారా ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. కంకవనాలను పెంచి వాటిని మార్కెటింగ్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తోందన్నారు. జిల్లాలోని ఆసక్తిగల వ్యక్తులకు కంకవనంతో వస్తువుల తయారీపై శిక్షణ ఇప్పించడానికి ట్రైనర్లను పిలిపిస్తున్నట్లు తెలిపారు.
మొక్కలు నాటిన అధికారులు
ప్రతీ ఒక్కరు మొక్కలను పెంచాలని అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు అన్నారు. పనుల జాతరలో భాగంగా ఐటీడీఏ నర్సరీ వద్ద వారు మొక్కలను నాటారు. ఉపాధి హామీలో భాగంగా ప్రతీ ఒక్కరికి మొక్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వ్యక్తులు ఈజీఎస్, జీపీ సిబ్బందిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కుమార్, ఈజీఎస్ ఏపీఓ చరణ్‌రాజ్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ స్థలాలను పరిశీలించిన అధికారులు