
అంగన్‌వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలి
గోవిందరావుపేట: అంగన్‌వాడీలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. పస్రా పీఎస్‌ఆర్ గార్డెన్‌లో శుక్రవారం తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ములుగు జిల్లా మహాసభలను సరోజన, రుద్రమదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయలక్ష్మి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఐసీడీఎస్‌తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తెచ్చిందని అన్నారు. ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ సిఫార్సులను అమలు చేస్తుందని, ఐసీడీఎస్‌ను నిర్వీర్యపరచడానికి నిర్ణయం చేయడం దుర్మార్గమని అన్నారు. విద్యాబోధన బాధ్యతలను అంగన్‌వాడీ టీచర్స్‌కు, హెల్పర్లకు ఇవ్వాలని, వలంటీర్లకిచ్చే అదనపు వేతనం అంగన్‌వాడీ టీచర్లకి ఇవ్వాలని అన్నారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, హెల్పర్లర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఎండీ దావుద్, కొప్పుల రఘుపతి, సోమా మల్లారెడ్డి, గొంది రాజేష్, సమ్మక్క, పద్మారాణి, భాగ్యలక్ష్మి, పార్వతి, సూరమ్మ, సరిత, రమ, రుక్మిణి, ధనలక్ష్మి, మోక్షరాణి, దీప, వెంకటరమణ, విజయలక్ష్మి, మల్లికార్జున, శోభ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
జయలక్ష్మి