
అక్రమాలకు కేరాఫ్‌గా డీటీఓ కార్యాలయాలు!
అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ..
సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు అగడం లేదు. అన్ని పనులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు రూ.లక్షలకు పడగలెత్తుతుండగా.. అధికారుల ఆదాయం, అక్రమాస్తులకు హద్దూపద్దు లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధి కారులు జరిపిన దాడుల్లో వెల్లడవుతున్న ఆస్తుల వివరాలే ఇందుకు సాక్ష్యం. మే 7న ఏకంగా వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ.. ఆ తర్వాత ఈ జిల్లాలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగిత్యాల డీటీఓ భద్రునా యక్ రూ.22వేలు తీసుకుంటుండగా ఆగస్టు 6న పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండలలో ఎంవీఐగా పనిచేసిన జి.వివేకానంద రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. నెల రోజుల కిందట వివిధ పనుల కోసం ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. కొందరు సీనియర్ ఎంవీఐల ఆస్తులపై ఆరా తీస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది.
ఏసీబీ దాడులకు వెరవని
రవాణాశాఖ అధికారులు
వసూళ్లకు ‘ప్రైవేట్’ వ్యక్తులు,
ఏజెంట్లే మధ్యవర్తులు
కాసుల కక్కుర్తితో అడ్డంగా
దొరుకుతున్న అధికారులు
ఆదాయాన్ని మించిన ఆస్తులు..
ఆ ఫిర్యాదులపైనే పలువురిపై దాడులు
రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడీ పోస్టింగ్‌లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్‌స్పెకర్లు ఇప్పుడు ఇన్‌చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్‌లు తిరకాసు చేసి జూనియర్‌లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్‌గా ఉన్న 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక అత నే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యా చ్‌కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియ ర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మా మూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉ న్నాయి. ఇదిలాఉంటే ఇన్‌చార్జ్‌ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది.వరంగల్‌లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్‌చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికా రి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్‌చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్‌ఛార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్‌లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారు ల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నా రు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. కాగా,రవాణాశాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అ ధికా రులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ కూడా ఆశాఖలో జరుగుతోంది. వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు,అధికారులపై ఉదా సీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.