
నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి
● మున్సిపల్ కమిషనర్ సంపత్
ములుగు రూరల్: భారీ వర్షాల కారణంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ సంపత్, రాయినిగూడెం మెడికల్ ఆఫీసర్ అన్వేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో డెంగీ పాజిటివ్ కేసు నమోదు కాగా పీహెచ్‌సీ వైద్యుడు అన్వేష్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటితొట్లు, పూల కుండీలు, పాత కూలర్లు, టైర్లలో నీటి నిల్వల కారణంగా దోమలు ల్వారా వృద్ది చెంది డెంగీ, మలేరియా వచ్చే ప్రమాదం ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని ఖాళీ స్థలాలు ఉన్నవారు చెట్లు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం కాలనీల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.