Yuvika Chaudhary Says Planning A Child Since Wedding With Prince Narula - Sakshi
Sakshi News home page

Yuvika Chaudhary: 2016 నుంచి పిల్లల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం.. కానీ..

Jul 6 2023 6:12 PM | Updated on Jul 6 2023 6:55 PM

Yuvika Chaudhary says Planning a Child Since Wedding with Prince Narula - Sakshi

మేము పెళ్లయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకున్నాం. కానీ ఆ భగవంతుడి ఆలోచన మరోలా ఉన్నట్లుంది.

బిగ్‌బాస్‌ షోలో లవ్‌ స్టోరీలో కామన్‌.. కానీ ఈ ప్రేమకథలన్నీ షోకు శుభం కార్డు పడే సమయానికే ముగిసిపోతాయి. అంటే చాలామటుకు డ్రామానే ఉంటుంది. కొందరు మాత్రం నిజంగా ప్రేమించుకుని, బయటకు వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలా బిగ్‌బాస్‌ షోతో మొదలైన ప్రేమను పెళ్లితో పదిలపర్చుకున్న జంట ప్రిన్స్‌ నరూలా- యువికా చౌదరి. వీరిద్దరూ తొలిసారి హిందీ బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో కలుసుకున్నారు. అప్పటినుంచి వీరి మధ్య సమ్‌సమ్‌థింగ్‌ స్టార్ట్‌ అయింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో హార్ట్‌ షేప్‌ పరాటా చేసి మరీ తనను మెప్పించాడు ప్రిన్స్‌. ఏడాది తిరిగేసరికి వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. 2016 నుంచి భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్న వీరు ఎంతోకాలంగా పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటి యువికా చౌదరి మాట్లాడుతూ.. యుక్త వయసు రాగానే పెళ్లెప్పుడు? అని అడుగుతారు. పెళ్లి చేసుకున్నాక పిల్లల్నెప్పుడు కంటున్నావు? అని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయింది. నిజానికి మేము పెళ్లయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకున్నాం.

కానీ ఆ భగవంతుడి ఆలోచన మరోలా ఉన్నట్లుంది. అతడు రాసిన రాతను మనం మార్చలేం కదా! అని చెప్పుకొచ్చింది యువికా చౌదరి. కాగా ప్రిన్స్‌ నరూలా.. ఎమ్‌టీవీ రోడీస్‌ 19లో గ్యాంగ్స్‌ లీడర్స్‌లో ఒకరిగా పార్టిసిపేట్‌ చేస్తున్నాడు. యువికా గతేడాది వచ్చిన సైబర్‌ వార్‌ సినిమా, రూహనియత్‌ అనే వెబ్‌ సిరీస్‌లో చివరిసారిగా కనిపించింది.

చదవండి: లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదట.. లస్ట్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటున్న డర్టీ పిక్చర్‌ హీరోయిన్‌

Advertisement
 
Advertisement
Advertisement