ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 9 సినిమాలు స్ట్రీమింగ్! | List Of 10 Upcoming Movies, Web Series Releasing In OTT On Feb 2nd 2024 - Sakshi
Sakshi News home page

This Friday OTT Movie Releases: ఓటీటీల్లో ఒక్కరోజే 9 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండే స్పెషల్!

Published Thu, Feb 1 2024 9:10 PM

This Weekend Ott Release Movies List Goes Viral in Tollywood - Sakshi

మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారంలో చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. తెలుగులో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బిగ్‌బాస్‌ సోహైల్ సినిమా 'బూట్ కట్ బాలరాజు' సందడి చేయనున్నాయి. వీటితో పాటు అభినవ్ గోమటం నటించిన కిస్మత్, యశ్‌ పూరి చిత్రం హ్యాపీ ఎండిగ్‌, మరో చిత్రం గేమ్‌ ఆన్‌ కూడా రిలీజ్‌ అవుతున్నాయి. అయితే థియేటర్లలో ఈ వారంలో చిన్న సినిమాల హడావుడి ఉండనుంది. 

దీంతో ఈ వీకెండ్‌లో ఓటీటీ వైపు సినీ ప్రియులు చూసేస్తున్నారు. ఈ వచ్చే మూడు రోజుల్లో ఏయే సినిమాలు వస్తున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఓటీటీ సినిమాలు కూడా సిద్ధమైపోయాయి. వీటిలో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మిస్‌ ఫర్‌ఫెక్స్‌ వెబ్ సిరీస్‌, మరో సైకలాజికల్ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ఎల్‌ఎస్‌డీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే వెంకటేశ్‌ నటించిన సైంధవ్‌ కూడా స్ట్రీమింగ్‌కు వస్తుందన్న టాక్‌  అయితే వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.  మరో ఈ వీకెండ్‌ ఓ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి. 

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే

నెట్‌ఫ్లిక్స్
    ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 01
    లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 02
    ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02

అమెజాన్ ప్రైమ్

    డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 02
    మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 02
    సైంధవ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 02 (రూమర్ డేట్)

హాట్‌స్టార్

    మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 02
    సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02

మనోరమ మ్యాక్స్

    ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 02

ఎమ్‌ఎక్స్ ప్లేయర్

ఎల్‌ఎస్‌డీ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి-2


 

Advertisement
 
Advertisement
 
Advertisement