ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ మూడు మాత్రం స్పెషల్! | Sakshi
Sakshi News home page

This Week Ott Release Movies: ఈ వారం ఓటీటీకి ప్రియులకు పండగే.. ఏకంగా 20 సినిమాలు!

Published Sun, Feb 4 2024 9:27 PM

This Week Ott Release Movies and Web Series List Here Goes Viral - Sakshi

మరోవారం రానే వచ్చింది. వీకెండ్‌ ముగియడంతో సినీ ఆడియన్స్ ఎప్పటిలాగే వర్క్‌ మోడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కాగా.. గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ అయ్యాయి. ఒకటి, రెండు చిత్రాలు మినహా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వచ్చేవారంలో ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ వారంలో ముఖ్యంగా సంక్రాంతికి సందడి చేసిన సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో మహేశ్ బాబు గుంటూరు కారం, కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుశ్ కెప్టెన్ మిల్లర్‌, కన్నడ స్టార్‌ దర్శన నటించిన కాటేరా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. వీటితో భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్‌ భక్షక్‌, సుస్మితా సేన్ ఆర్య-3 వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతున్నాయి.  అంతే కాకుండా ఈ వారంలో మాస్ మహారాజా నటించిన ఈగల్‌ థియేటర్ల వద్ద సందడి చేయనుంది. మరీ ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. 

నెట్‌ఫ్లిక్స్

 •  డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05
 •  ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్  - ఫిబ్రవరి 05
 •  మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05
 •  మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05
 •  ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05
 •  లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)-  ఫిబ్రవరి 07
 •  రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07
 •  లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07
 •  వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08
 •  గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09
 •  భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ )- ఫిబ్రవరి 09 
 •  లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09
 •  యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09
 •  ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09
 •  ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09
 •  హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10
 •  బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11


అమెజాన్ ప్రైమ్

 • కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 

డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌

 • ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9

జీ5

 • కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09


జియో సినిమా

 • ది ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) - ఫిబ్రవరి 6
 • ది నన్‌ 2 - ఫిబ్రవరి 7
 • హలో (వెబ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 8

Advertisement
 
Advertisement