లైలా కోసం ఇంత కష్టపడ్డారా?.. మాస్‌ కా దాస్ వీడియో చూశారా? | Vishwak Sen Transformation Into Laila Character In Up coming Movie | Sakshi
Sakshi News home page

Vishwak Sen: లైలా కోసం ఇంత కష్టపడ్డారా?.. విశ్వక్ సేన్ వీడియో చూశారా?

Jan 27 2025 7:22 PM | Updated on Jan 27 2025 7:59 PM

Vishwak Sen Transformation Into Laila Character In Up coming Movie

మాస్‌ కా దాస్ విశ్వక్‌ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం లైలా( Laila). ఈ చిత్రానికి రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

రెండు పాత్రల్లో విశ్వక్ సేన్..

ఈ మూవీలో సోనూ, లైలా అనే లేడీ పాత్రల్లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు విశ్వక్‌ సేన్. ముఖ్యంగా లేడీ గెటప్‌లో విశ్వక్‌ సేన్‌ లుక్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన లుక్ సోనూ మోడల్ నుంచి లైలా ఎలా మారిందో చూశారా? అంటూ ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ లుక్‌ కోసం ఎంత కష్టపడ్డారో మీరు కూడా చూసేయండి.

ఆ ఫోటోను వాడకండి..

తన లుక్‌ గురించి ఇటీవల సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో కూడా మాట్లాడారు. లైలా లుక్‌పై విశ్వక్‌ సేన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర ముఖ్యంగా అమ్మాయి గెటప్‌లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement