తగ్గేదేలే అంటూ విశ్వక్‌ సేన్ పోస్ట్.. మూవీ రిలీజ్ వాయిదా! | Vishwak Sen Movie Gangs Of Godavari Release Date Postponed | Sakshi
Sakshi News home page

Gangs Of Godavari: అనుకున్నదే జరిగింది.. విశ్వక్‌సేన్‌ మూవీ రిలీజ్‌ వాయిదా!

Nov 28 2023 7:09 AM | Updated on Nov 28 2023 9:18 AM

Vishwak Sen Movie Gangs Of Godavari Release Date Postponed - Sakshi

యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి. ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. గతంలో విశ్వక్‌ సేన్‌ కూడా సినిమా రిలీజ్‌ తేదీ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ పోస్ట్‌ కూడా పెట్టారు. అది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే విశ్వక్‌ సేన్‌ అనుకున్నదొకటి.. అయిందొక్కటి అన్న చందంగా మారింది. వచ్చే నెల 8న ఈ మూవీని రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రిలీజ్‌ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చిన 8న విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్వీట్ చేసింది. దీంతో వచ్చే నెల మూవీ రిలీజవుతుందని భావించిన విశ్వక్‌ సేన్‌ అభిమానులకు నిరాశే ఎదురైంది. 
 
 అదే కారణమా?

అయితే డిసెంబర్‌ మొదటివారంలో  నాని నటించిన హాయ్‌ నాన్న, నితిన్‌ మూవీ ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్లే గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి వాయిదా పడే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అదే సమయంలో విశ్వక్ సేన్‌ పెట్టిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

స్పందించిన నిర్మాత నాగవంశీ

విశ్వక్‌ సేన్‌ పోస్ట్‌పై నిర్మాత నాగవంశీ స్పందించారు. హీరో నాని, నితిన్‌తో మా బ్యానర్‌కు సత్సంబంధాలే ఉన్నాయని.. ఒకేసారి అన్ని విడుదలైతే పోటీ ఉంటుందని భావించి.. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని వాయిదా వేద్దామని నేను అంటానేమోనని విశ్వక్‌ సేన్ భావించారు. అందువల్లే విశ్వక్ సేన్ అలాంటి పోస్ట్ పెట్టి ఉంటారని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement