ఆలస్యంగా వస్తున్న గ్యాంగ్‌ | Vishwak Sen Gangs Of Godavari Movie Postponed Once Again, Know New Release Date | Sakshi
Sakshi News home page

Gangs Of Godavari: ఆలస్యంగా వస్తున్న గ్యాంగ్‌

Published Fri, May 10 2024 4:46 AM

Vishwak Sen Gangs Of Godavari postponed once again

కాస్త లేట్‌గా థియేటర్స్‌లోకి రానున్నారు గోదావరి గ్యాంగ్‌. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన యాక్షన్‌ చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా, కీలక పాత్రలో అంజలి నటించారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కావాల్సింది.

కానీ వాయిదా వేసి, ఈ నెల 31న రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమా థీమ్‌ సాంగ్‌ ‘బ్యాడ్‌’ లిరికల్‌ వీడియో నేడు విడుదలవుతోంది. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలో లంకల రత్నగా విశ్వక్‌ సేన్, రత్నమాలగా అంజలి, బుజ్జిగా నేహా శెట్టి కనిపిస్తారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement