శ్రీ గౌరీప్రియ, అశోక్
అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీఐఎస్ఏ–వింటారా సరదాగా’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం ప్రకటించారు.
‘‘ఉన్నత కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవన శైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలను ఈ చిత్రంలో వినోదాత్మకంగా ఆవిష్కరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది.


