ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్‌ హీరో థ్రిల్లర్‌ మూవీ.. ఎక్కడంటే? | Vikrant Massey, Nora Fatehi Starrer Blackout Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

మూడేళ్లకు ఓటీటీలో 12th ఫెయిల్‌ హీరో కొత్త మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

May 16 2024 7:23 PM | Updated on May 16 2024 8:03 PM

Vikrant Massey, Nora Fatehi Starrer Blackout Movie OTT Release Date Out

ప్రస్తుతం విక్రాంత్‌ చేతిలో బోలెడన్ని చిత్రాలున్నాయి. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

విక్రాంత్‌ మాస్సే.. బాలీవుడ్‌లో ఎంతోకాలంగా హీరోగా రాణిస్తున్నాడు. అయితే 12th ఫెయిల్‌ మూవీతో మాత్రం ఒక్కసారిగా ట్రెండయ్యాడు. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జనాల్ని పట్టి కుదిపేసింది. ఈ ఒక్క చిత్రంతో సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్రాంత్‌ చేతిలో బోలెడన్ని చిత్రాలున్నాయి. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

విక్రాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్లాక్‌ అవుట్‌. మౌనీ రాయ్‌ హీరోయిన్‌గా నటించింది. సునీల్‌ గ్రోవర్‌, కరణ్‌ సోనావానే కీలక పాత్రల్లో అలరించారు. థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవంగ్‌ భవసార్‌ దర్శకత్వం వహించాడు. 2021లో ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించగా ఇన్నాళ్లకు రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఈ చిత్రం జియో సినిమాలో జూన్‌ 7 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జియో సినిమా అధికారికంగా వెల్లడించింది.

 

చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్‌ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు

Advertisement
 
Advertisement
Advertisement