తంగలాన్‌ సెన్సార్‌ పూర్తి.. రన్‌ టైమ్‌ ఎంతంటే.. | Vikram Thangalaan Movie Censor Final Report | Sakshi
Sakshi News home page

తంగలాన్‌ సెన్సార్‌ పూర్తి.. రన్‌ టైమ్‌ ఎంతంటే..

Jul 30 2024 1:10 PM | Updated on Jul 30 2024 3:14 PM

Vikram Thangalaan Movie Censor Final Report

కోలీవుడ్‌ సినీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విక్రమ్‌ ఫ్యాన్స్‌ తంగలాన్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియడ్‌ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే ఆగష్టు 15న విడుదల కానుంది. పా. రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో  మాళవికా మోహనన్‌ నెగటివ్ రోల్ పోషిస్తుండగా.. పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

కోలార్‌ బంగారు గనుల నేపధ్యంలో, అక్కడ పని చేసే కార్యికుల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్ర విడుదల తేదీని పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆగస్ట్‌ 15వ తేదీన తమిళం,తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తంగళాన్‌ చిత్రానికి  యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్‌ బోర్డు ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 37 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

విక్రమ్‌, మాళవికా మోహనన్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ట్రైలర్‌తోనే తెలుస్తోంది. వారిద్దరి మేకప్‌ కోసమే చాలా సమయం తీసుకున్నట్లు పలుప ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. సినిమా  కోసం ఎంతటి కష్టమైన భరించే విక్రమ్ తంగలాన్ కోసం 35 కేజీలు తగ్గారట. ఈ సినిమాలో మరో విశేషం విక్రమ్‌కు ఎలాంటి డైలాగ్స్ ఉండకపోవడమని తెలుస్తోంది. అభిమానుల అంచనాలకు మించి తంగలాన్‌ చిత్రాన్ని డైరెక్టర్‌ పా రంజిత్‌ తెరకెక్కించాడు. ఆగష్టు 15న తంగలాన్‌ ప్రపంచంలో అద్భుతాలు ఉంటాయని అభిమానులు అంచనాలతో ఉ‍న్నారు.

Advertisement
 
Advertisement
Advertisement