ఎమోషన్‌... యాక్షన్‌ | Vijay Sethupathi Son Surya Sethupathi Phoenix movie teaser launch | Sakshi
Sakshi News home page

ఎమోషన్‌... యాక్షన్‌

Aug 10 2025 12:34 AM | Updated on Aug 10 2025 12:34 AM

Vijay Sethupathi Son Surya Sethupathi Phoenix movie teaser launch

విజయ్‌ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం అయిన తమిళ సినిమా ‘ఫీనిక్స్‌’. ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు దర్శకత్వంలో రాజ్యలక్ష్మి అనల్‌ అరసు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదలైంది. త్వరలో ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా తెలుగు టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సూర్య సేతుపతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటు ట్రైనింగ్‌ తీసుకున్నాను.

యాక్షన్‌ సీక్వెన్స్‌ని ముందే ప్రాక్టీస్‌ చేయించారు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్‌ కూడా ఉంది. ఒక మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘సూర్య సేతుపతి హార్డ్‌వర్కర్‌. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మంచి ఎమోషన్‌ కూడా ఉంది’’ అన్నారు అనల్‌ అరసు. ‘‘ఎమోషనల్‌ అండ్‌ హై యాక్షన్‌ స్టోరీ ఇది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని తెలిపారు ధనుంజయన్‌. ‘‘ఫీనిక్స్‌ మంచి సినిమా’’ అన్నారు రాజ్యలక్ష్మి. హీరోయిన్‌ వర్ష , రైటర్‌ భాష్యశ్రీ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement