పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన చిత్రం ‘రణబాలి’. గతంలో విజయ్‌తో ‘టాక్సీవాలా’ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్రం రాక ముందు రాయలసీమలోని ఒక ప్రాంతంలో జరిగిన అమానవీయ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రణబాలి పాత్ర డిమాండ్ అనుగుణంగా వయొలెన్స్ కూడా అవసరమైన మోతాదు కంటే ఎక్కువే పెట్టినట్టు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఈ మూవీ ఓవర్‌సీస్‌లో కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ కానుందని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. ఇతర భాషల్లో డబ్బింగ్ పూర్తి కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. డబ్బింగ్ వర్షన్లు మాత్రం 2026 అక్టోబర్ 23న విడుదలవుతాయని పంపిణీదారులు క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇప్పటికే విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మెయిన్ థియేటర్లలో టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రీ-సేల్స్ ద్వారా 50 వేల డాలర్ల మార్కును దాటేసింది. రాబోయే రోజుల్లో ప్రీమియర్ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కాగా.. ఈ సినిమాకి ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందించారు.
#Ranabaali will release in TELUGU ONLY across Overseas Markets on October 16. (Premieres on Oct 15) Overseas by @PharsFilm @PrathyangiraUS @TheDeverakonda @iamRashmika #ArnoldVosloo @Rahul_Sankrityn @MythriOfficial @TSeries @RanabaaliFilm @PrathyangiraOS https://t.co/djuCB5JRPM
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 10, 2026


