విజయ్ దేవరకొండ రణబాలి.. గండికోటలో గుర్రపు స్వారీ..! | Vijay Devarakonda Ranabaali Movie Shooting at Gandi Kota | Sakshi
Sakshi News home page

Ranabaali Movie: విజయ్ దేవరకొండ రణబాలి.. గండికోటలో గుర్రపు స్వారీ..!

Jun 3 2026 7:19 PM | Updated on Jun 3 2026 7:22 PM

Vijay Devarakonda Ranabaali Movie Shooting at Gandi Kota

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ రణబాలి. ఈ మూవీని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ కథ బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే కర్నూల్‌, నంద్యాల జిల్లాలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌ జరిగింది.

ప్రస్తుతం రణబాలి షూటింగ్ కడప జిల్లాలోని గండకోటలో జరుగుతోంది. రాయలసీమ కథకు తగినట్లుగా యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా  కోట ముఖద్వారం వద్ద, ధాన్యాగారంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement