అక్టోబరులో ఆరంభం  | Sakshi
Sakshi News home page

అక్టోబరులో ఆరంభం 

Published Wed, Sep 13 2023 12:11 AM

Varun Tej Matka movie to roll from October 4 in Hyderabad - Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘పలాస’ ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రం రూ΄పొందుతున్న సంగతి తెలిసిందే. మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని, ఈ తొలి షెడ్యూల్‌ దాదాపు ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లోని విభిన్నమైన లొకేషన్స్‌లో జరుగుతుందని సమాచారం.

వైజాగ్‌ నేపథ్యంలో 1958 – 1982 టైమ్‌ పీరియడ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ చిత్రం తెరకెక్కనుంది. కథానుగుణంగా అప్పటి వైజాగ్‌ను తలపించేలా సెట్‌ను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్‌. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement