అఫీషియల్: వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ ఫిక్స్ | Varun Tej and Lavanya Tripathi get engaged at his home on June 9 | Sakshi
Sakshi News home page

Varun Tej and Lavanya: అఫీషియల్: వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ డేట్ ఇదే!

Jun 8 2023 12:01 PM | Updated on Jun 8 2023 12:54 PM

Varun Tej and Lavanya Tripathi get engaged at his home on June 9 - Sakshi

మెగా ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనునట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం తేదీ అఫిషీయల్‌గా ప్రకటించారు. ఈ నెల 9న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగనున్నట్లు ఓ కార్డ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. 2017లో మిస్టర్ చిత్రం సెట్స్‌లో తొలిసారిగా ఈ జంట కలుసుకున్నారు. గతంలో కూడా లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌ ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?)

ఈ వేడుక హైదరాబాద్‌లోని వరుణ్ తేజ్ ఇంట్లో జరగనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ జరగనున్నట్లు సమాచారం. కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వరుణ్‌, లావణ్య హైదరాబాద్‌ చేరుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

(ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌?)

కాగా.. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’ మూవీ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement