Niharika Konidela Response On Varun Tej And Lavanya Tripathi Engagement Rumours, Deets Inside - Sakshi
Sakshi News home page

Niharika Konidela: వరుణ్‌- లావణ్యల ఎంగేజ్‌మెంట్‌? నిహారిక ఏమందంటే?

May 17 2023 5:22 PM | Updated on May 17 2023 5:53 PM

Niharika Konidela Response on Varun Tej, Lavanya Tripathi Engagement Rumours - Sakshi

డెడ్‌ పిక్సెట్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నిహారికకు కూడా వీరిద్దరి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. లావణ్యతో వరుణ్‌ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో..

ఇది సమ్మర్‌ సీజనా? లేక పెళ్లిళ్ల సీజనా? అనేట్లుగా ఓ రేంజ్‌లో వివాహాలు జరుగుతున్నాయి. మళ్లీ ముహూర్తాలు దొరకవనుకుంటున్నారో ఏమో కానీ మండుటెండలోనూ పెళ్లిపనులు చేసుకుంటూ లగ్గాలు చేసేసుకుంటున్నారు. అటు సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించి కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్‌ జూన్‌లో పెళ్లికి రెడీ అయ్యాడు. అటు మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయనున్నాడంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. తాజాగా డెడ్‌ పిక్సెట్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నిహారికకు కూడా వీరిద్దరి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. లావణ్యతో వరుణ్‌ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత? అని ఓ విలేకరి ప్రశ్నించగా దీనిపై స్పందించేందుకు నిహారిక నిరాకరించింది. 'సారీ, ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం డెడ్‌ పిక్సెల్స్‌ గురించే చర్చించానుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. 

కాగా వరుణ్‌, లావణ్య.. మిస్టర్‌, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల లావణ్య.. మోస్ట్‌ హ్యాండ్సమ్‌ ఎవరన్న ప్రశ్నకు వరుణ్‌ అని సమాధానమివ్వడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఈ క్రమంలో జూన్‌లో వీరి నిశ్చితార్థం జరగనుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

చదవండి: వెధవలకు అటెన్షన్‌ ఇస్తే రెచ్చిపోతారు: నిహారిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement