థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో 'నింద' ట్రైలర్.. మీరు చూశారా? | Varun Sandesh Nindha Trailer And Movie Release Details | Sakshi
Sakshi News home page

Nindha Movie: వరుణ్ సందేశ్ 'నింద' ట్రైలర్ రిలీజ్

Jun 11 2024 9:51 PM | Updated on Jun 11 2024 9:51 PM

Varun Sandesh Nindha Trailer And Movie Release Details

యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 21న థియేటర్లలోకి రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?)

అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన కేసు అనే పాయింట్.. అసలు నేరస్థుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇందులో శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ సిద్ధార్థ కృష్ణ కీలక పాత్ర పోషించారు. మరి ఈ మూవీతో నైనా వరుణ్ సందేశ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?

(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే)

Advertisement
 
Advertisement
Advertisement